బాసరలో భక్తుల రద్దీ దృష్ట్యా అక్షరాభ్యాసాన్ని ఆన్‌లైన్‌లో తీసుకురావాలని దేవాదాయ శాఖ ఇటీవల నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆన్‌లైన్ అక్షరాభ్యాసాలకు టికెట్ల ధరలను నిర్ణయించారు. భారత దేశంలోని వారితో పాటు విదేశాల్లో ఉన్నవారు కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే వారికి పూజ చేసిన వస్తువులను తపాలా శాఖ ద్వారా పంపించడానికి ఏర్పాట్లు చేశారు. విదేశీయులకు ఆన్‌లైన్ టికెట్ ధర రూ. 2516 ఉండగా, స్వదేశంలో ఉన్నవారికి రూ.1516గా ఉన్నాయి. బాసరలోని సరస్వతీ అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం భక్తులు పోటెత్తుతారు. ముఖ్యంగా ఉత్సవాల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుండటంతో చిన్నారులకు అక్షరాభ్యాసాలు ఆలస్యం అవుతున్నాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న దేవాదాయ శాఖ ఆన్‌లైన్‌లో అక్షరాభ్యాసాలు, పూజలు ప్రారంభించాలని నిర్ణయించారు. వీటిని ఏవిధంగా నిర్వహించాలనే అంశాలపై ఇటీవల ఆలయంలోని సిబ్బంది, వేద పండితులతో ఈఓ విజయరామారావు చర్చించారు.
బాసరలో ఆన్‌లైన్ అక్షరాభ్యాస !
December 08, 2022
0
Tags