ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ రాజ్యసభ కొత్త చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశల తొలిరోజు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఇతర నేతలు ధన్కర్ను చైర్మన్ సీటు వరకు తీసుకుని వెళ్లారు. పలు పార్టీలకు చెందిన ఎంపీలు ఈ సందర్భంగా ధన్కర్కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను ధన్కర్ కొనసాగిస్తారని అధికార పార్టీ సభ్యులు ఆశాభావం వ్యక్తంచేశారు. చిన్న పార్టీలకు మరింత సమయం ఇవ్వాలని, ప్రభుత్వ బిల్లుల స్క్రూటినీ కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను బలోపేతం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్సభ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఇటీవల మరణించిన సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్, 8 మంది మాజీ సభ్యులకు లోక్సభ నివాళులర్పించింది. ద మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ (అమెండ్మెంట్) బిల్లు, 2022ను ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది.
రాజ్యసభ కొత్త చైర్మన్గా జగ్దీప్ ధన్కర్ బాధ్యతలు స్వీకరణ
December 08, 2022
0
Tags