విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల జులుం !

Telugu Lo Computer
0


న్యూ ఢిల్లీలో మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ పథకాన్ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ఎస్‌ఎఫ్‌ఐతో పాటు ఇతర విద్యార్థి సంఘాలు విద్యా మంత్రిత్వ శాఖ ముందు ప్రదర్శన నిర్వహించాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మైనార్టీ వర్గాల విద్యార్థులు ఇతర పథకాల పరిధిలోకి వచ్చినందున ఎంఎఎన్‌ఎఫ్‌ స్కాలర్‌షిప్‌ను ఉపసంహరించుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపిందని పేర్కొన్నారు. ఎంఎఎన్‌ఎఫ్‌ 2008లో బౌద్ధ, క్రిస్టియన్‌, ముస్లిం, పార్సీ, సిక్కు, జైన్‌ వంటి ఆరు నోటిఫైడ్‌ మైనార్టీ వర్గాల విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రవేశపెట్టబడిందని, దాన్ని రద్దు చేయడంతో వారి ఉన్నత విద్య ఆశలు నాశనమవుతాయని అన్నారు. ఎంఎఎన్‌ఎఫ్‌ రద్దును వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు డిమాండ్‌ చేశారు. అనంతరం విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థినులతో సహా అనేక మంది విద్యార్థులను బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీసులు అరెస్టు చేశారు. వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేసి, మందిర్‌ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థులను రోడ్డుపై ఈడ్చుకుంటూ బస్సుల్లో, పోలీస్‌ వ్యానుల్లో కుక్కారు. విద్యార్థినుల పట్ల మగ పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల చర్యలతో కొంత మంది విద్యార్థులు అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)