తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో జరిగిన వైశాలి కిడ్నాప్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. పట్టపగలు టీ స్టాల్ ఓనర్ నవీన్ రెడ్డి 100 మందితో యువతి ఇంటికొచ్చి నానా హంగామా చేశాడు. యువతి ఇంటి వద్ద ఉన్న కార్లను ధ్వంసం చేసి, అడ్డొచ్చిన యువతీ తల్లిదండ్రులు, బంధువులను కర్రలతో కొట్టారు. అనంతరం డెంటల్ డాక్టర్ వైశాలిని నవీన్ రెడ్డి కిడ్నాప్ చేశాడు. సినిమా రేంజ్ ను తలపించిన ఈ కిడ్నాప్ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను చాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు 6 గంటల్లోనే యువతి ఆచూకీని కనిపెట్టారు. కిడ్నాప్‌కు గురైన యువతి వైశాలి మీడియా ముందుకు వచ్చి తానను కిడ్నాప్ చేసి తీవ్రంగా హింసించారని, దారుణంగా ట్రీట్ చేశారని చెప్పుకొచ్చింది. అయితే తనకు నవీన్‌రెడ్డితో పెళ్లి జరగలేదని తెలిపింది.
నన్ను దారుణంగా ట్రీట్ చేశారు !
December 11, 2022
0