యువకునిపై పులి దాడి

Telugu Lo Computer
0


తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్ నగర్ లోని ఇర్ఫాన్ కాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్ మహ్మద్​తాహెర్, పనికోసం వాంకిడి మండలానికి వెళ్లి అక్కడి నుంచి కాగజ్ నగర్ కు అంకుశాపూర్ రూట్ లో వస్తున్నాడు. మధ్యాహ్నం ఒకటిన్నరకు అంకుశాపూర్ దాటి వచ్చిన తర్వాత రోడ్డు మీద మూల మలుపు దగ్గరకు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా పెద్దపులి బైక్ కు అడ్డు వచ్చి దాడి చేసింది. పంజాతో కొట్టగా అది తాహెర్​ కాలికి తాకింది. దీంతో టూవీలర్ ​స్కిడ్​అయి పెద్దపులిని ఈడ్చుకుంటూ కొద్దిదూరం వరకు వెళ్లింది. ఈ క్రమంలో పెద్ద పెట్టున అరవగా వేరే వైపుకు దూకి వెళ్లిపోయింది. పులి దాడిలో కాలికి గాయం కాగా, బైక్ మీద నుంచి కింద పడడంతో భుజానికి, వీపుపై, కాలికి, చేతులకు గాయాలయ్యాయని తాహెర్​చెప్పాడు. వెనుక వచ్చిన బైక్ మీద లిఫ్ట్ అడిగి కాగ జ్ నగర్ కు వచ్చి హాస్పిటల్ లో చేరినట్టు చెప్పాడు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా సిబ్బంది స్పాట్ కు వెళ్లి పరిశీలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)