తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం రాజ్ భవన్లో గవర్నర్ ఉదయనిధి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, డిఎంకే నాయకులు హాజరయ్యారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉదయనిధి స్టాలిన్కు రాష్ట్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖను కేటాయించారు. నటుడిగా కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఉదయనిధి ఆ తర్వాత నిర్మాత, డిస్ట్రిబ్యూటర్గా మారారు. గతేడాది తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసి చెపాక్ తిరువల్లికెని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఉదయనిధి ప్రమాణ స్వీకారం
December 14, 2022
0
Tags