అమెరికాలోని అర్కాన్సాస్ అనే పట్టణాని సమీపంలోని ఎర్లేకు చెందిన 18 ఏళ్ల యువకుడు జైలెన్ స్మిత్ ఇటీవలే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. అతడికి చిన్నతనం నుంచి రాజకీయాలపై చాలా ఆసక్తి ఉండేది. నిత్యం తన స్నేహితులతో సైతం దేశ రాజకీయాల గురించి చర్చిస్తుండే వాడు. తాను ఎప్పటికైన రాజకీయలో వెళ్లి, మంచి నాయకుడిగా గుర్తింపు సంపాదించాలని అనుకునేవాడు. అందుకే స్కూలింగ్ రోజుల నుంచి స్థానికులతో కలివిడిగా ఉండటం, నిత్య తోటివారికి, పెద్దలకు సాయం చేస్తుండే వాడు. ఎవర్ని పొరపాటును తన మాటలతో బాధించేవాడు కాదు. అలానే వ్యవస్థలపై, రాజకీయ పరిణామాలపై, సమాజంలో జరుగుతున్న అంశాలపై పెద్దలకు వివరించేవాడు. స్థానికంగా ఎదురయ్యే సమస్యల గురించి వారితో చర్చించే వాడు. అతడి ఆలోచనలకు, మాటలకు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు. ఇలా పెరుగుతూ పెద్దైన జైలెన్ స్మిత్..గత ఏడాది స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఎర్లే పట్టణానికి ఎన్నికలు వచ్చాయి. మిస్సిస్సిప్పి నదికి పశ్చిమాన 30 మైళ్ల దూరంలో ఉన్న ఎర్లే పట్టణంలో 1831 మంది జనాభా ఉంది. స్థానికంగా పారిశుద్ధ్య విభాగంలో పనిచేసే సూపరింటెండ్ నేమీ మాథ్యూస్, జైలెన్ స్మీత్ ఈ ఎన్నికల్లో పోటీపడ్డారు. ఎన్నికల ప్రచారంలో స్మిత్ ప్రజా భద్రతను మెరుగు పర్చడం, పాడుబడిన గృహాలను , భవనాలను పునరుద్ధరించడం వంటి ప్రణాళికలను అభివృద్ధి పరుస్తున్నాని హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం వెలువడిన ఫలితాల్లో 235 ఓట్ల తేడాతో మాథ్యూస్ ను జైలెన్ స్మిత్ ఓడించాడు. ఎర్లే పట్టణంలోనే కాక యూఎస్ఏలోనే మేయర్ పీఠం గెలుచుకున్న అతిపిన్న వయస్కుడిగా జైలెన్ స్మిత్ చరిత్ర సృష్టించాడు.
పిన్న వయస్సులోనే మేయర్ గా ఎన్నికైన జైలెన్ స్మిత్
December 08, 2022
0
Tags