ట్రాన్స్‌జెండర్‌ను వివాహం చేసుకున్న యువకుడు

Telugu Lo Computer
0


ఉత్తర్‌ప్రదేశ్‌ ఆజంగఢ్‌ జిల్లాకు చెందిన వీరూ రాజ్‌భర్‌ (24), ఓ ట్రాన్స్‌జెండర్‌ను రెండేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గుడికి చెందిన ముస్కాన్‌ కిన్నార్‌ అనే ట్రాన్స్‌జెండర్‌ 2 ఏళ్ల క్రితం బ్రాస్‌ బ్యాండ్‌ పార్టీలో నృత్యం చేయడానికి మౌకి వచ్చింది. అక్కడ టెకై గ్రామానికి చెందిన వీరూ రాజ్‌భర్‌ను కలిసింది. మనసులు కలిసిన వారిద్దరూ అప్పటి నుంచి సహ జీవనం చేస్తున్నారు. తాజాగా పెళ్లిచేసుకోవాలని అనుకున్నారు. దీనికి కుటుంబ సభ్యులు కూడా అంగీకారం తెలపడం వల్ల ఇద్దరూ భైరోధం గుడిలో సంప్రదాయ పద్ధతిలో, వేదమంత్రాల సాక్షిగా వివాహం చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)