క్షమాపణ కోరిన తృణమూల్‌ మంత్రి

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్‌లో నిన్న సాయంత్రం జరిగిన ఓ ర్యాలీలో తృణమూల్‌ కాంగ్రెస్‌ గృహశాఖామంత్రి అఖిల్‌ గిరి మాట్లాడుతూ 'నేను అందంగా లేనని బిజెపి వాళ్లు అన్నారు. రూపాన్ని బట్టి మేము ఎవరినీ అంచనా వేయం. రాష్ట్రపతి పదవిని మేము గౌరవిస్తాం. అయితే మన రాష్ట్రపతి ఎలా కనిపిస్తున్నారు? అని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలను బాధ్యతారహితమైన వ్యాఖ్యలుగా ఎఐటియుసి పేర్కొంది. అలాగే మంత్రి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా.. 'రాష్ట్రపతి ద్రౌపది ముర్మును.. ఆమె పదవిని అత్యంత గౌరవంగా చూస్తామని' టిఎంసి అధికారి ప్రతినిధి సాకేత్‌ గోఖలే ట్వీట్‌ చేశారు. అయితే గౌరవనీయులైన రాష్ట్రపతిని అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని, బిజెపి నేతలు తనపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేంగానే రాష్ట్రపతిపై వ్యాఖ్యలు చేశానని,  ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నానని అఖిల్‌ గిరి తెలిపారు. టిఎంసి మంత్రి వ్యాఖ్యలకు ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ తీవ్రంగా విమర్శించారు. ద్రౌపది ముర్ము గిరిజన వర్గానికి చెందినవారు. టిఎంసి గిరిజనులకు వ్యతిరేకంగా ఉందని... అది వారి మాటల్లో స్పష్టంగా తెలుస్తుందని మజుందార్‌ అన్నారు. ఇక బిజెపి నేషనల్‌ అండ్‌ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ ఇన్‌ఛార్జీ, పశ్చిమబెంగాల్‌ కో- ఇంఛార్జి అమిత్‌ మాల్వియా ఒక ట్వీట్‌ చేస్తూ... 'మీరు రాష్ట్రపతిని అవమానించారు. మేము రూపం గురించి పట్టించుకోము. అయితే రాష్ట్రపతి మీకు ఎలా కనిపిస్తున్నారు? మమతాబెనర్జీ ఎప్పుడూ గిరిజన వ్యతిరేకినే. అందుకే గిరిజన వర్గానికి చెందిన ముర్ముకు రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో ఆమె మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడు మంత్రి కూడా సిగ్గుపడేలా ప్రసంగించారు' అని పేర్కొన్నారు. అయితే వ్యక్తిగత వ్యాఖ్యలకు తాము బాధ్యత వహించబోమని టిఎంసి తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)