సీనియర్‌ సిటిజన్లకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఆఫర్ !

Telugu Lo Computer
0


పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) 600 రోజుల ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ డిపాజిట్‌పై ఏడాదికి 7.85 శాతం వరకు వడ్డీ ఇవ్వనుంది. అక్టోబరు 19 నుంచి ఈ ప్రత్యేక డిపాజిట్‌ పథకం అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. వృద్ధులు (60 ఏళ్లు పైబడిన), సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు (80 ఏళ్లు పైబడిన వారు) రూ.2 కోట్ల లోపు కాలావధి డిపాజిట్లపై ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించింది. 600 రోజుల దేశీయ కాలావధి డిపాజిట్లపై 7 శాతం, 600 రోజులు (నాన్‌-కాలబుల్‌) రాబడులపై 7.05 శాతం వడ్డీ లభిస్తుంది. వృద్ధులు, సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు 7.50- 7.85 శాతం శ్రేణిలో వడ్డీ ఇవ్వనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)