ఝార్ఖండ్‌లో 77 శాతం రిజర్వేషన్లకు అసెంబ్లీ ఆమోదం

Telugu Lo Computer
0


గిరిజనులు ఎక్కువగా ఉండే ఝార్ఖండ్‌లో రిజర్వేషన్లను 77 శాతం పెంచుతూ శుక్రవారం అసెంబ్లీ తీర్మానం చేసింది. 2001 నాటి రిజర్వేషన్ చట్టాన్ని సవరిస్తూ ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 17 శాతం పెంచారు. ఇంతకు ముందు ఎస్టీలకు 26 శాతం, ఎస్సీలకు 10, ఓబీసీలకు 14 శాతం ఉంది. తాజా తీర్మానంతో ఎస్టీలకు 28 శాతం, ఎస్సీలకు 12, ఈబీసీలకు 15, ఓబీసీలకు 12 శాతం రిజర్వేషన్ ఉండనుంది. ఇదే సమయంలో ప్రజల నివాస స్థితిని నిర్ణయించేందుకు 1932 నాటి భూ రికార్డులను ఉపయోగించాలని ప్రతిపాదించిన బిల్లును కూడా ఆమోదించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)