భారతీయుల సగటు జీవిత కాలం పెరిగింది !

Telugu Lo Computer
0

జీవన విధానాల్లో వచ్చిన మార్పులతో భారతీయుల సగటు జీవితకాలం ఏటేటా పెరుగుతున్నది. ఈ ఏడాది నాటికి భారతీయుల ఆయుర్దాయం 70 ఏండ్లకు చేరిందని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో తెలియజేసింది. 1950లో 35.21 సంవత్సరాలుగా ఉన్న సగటు భారతీయుడి సగటు ఆయుష్షు.. 2100 నాటికి గణనీయంగా మెరుగై 81.96 ఏండ్లకు చేరుతుందని యూఎన్ అంచనా వేసింది. భారత్ లో వైద్య సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం, ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుందని, దాని కారణంగానే సగటు ఆయుష్షులో కూడా పెరుగుదల నమోదు అవుతుందని యూఎన్ తన రిపోర్టులో వెల్లడించింది. 1950 నుంచి 2100 వరకు 150 ఏండ్ల కాల వ్యవధిలో ఆయుర్థాయం మెరుగుదల విషయంలో అమెరికా, చైనాల కంటే భారత్ మెరుగ్గా ఉన్నదని యూఎన్ లెక్కలతో సహా స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)