ఈ మేక రూ.70 లక్షలట..!

Telugu Lo Computer
0

 


ఛత్తీస్ గఢ్ లోని రాయ్‌పూర్‌లోని బైజ్ నాథ్ మార్కెట్‌కు వచ్చిన ఓ మేక అందరి చూపును ఆకర్షించింది. ఈ మేకను మధ్యప్రదేశ్ అనుప్పూర్ కు చెందిన వాహిద్ హుస్సేన్ అనే వ్యక్తి మార్కెట్లో అమ్మేందుకు తీసుకొచ్చిన తన మేకకు రూ. 70 లక్షల ధరను నిర్ణయంచారు. దీనిలో చాలా ప్రత్యేకతలున్నాయని ఆయన చెబుతున్నారు. ఇది ప్రకృతి ఇచ్చిన ప్రసాదం అని అంటున్నారు. ఈ మేక స్వదేశీ జాతికి చెందినది. ఇది ప్రకృతి ప్రసాదం. దీని శరీరంపై ఉర్దూలో అల్లా, మహమ్మద్ అని రాసి ఉంది. అందుకే ఇది ఎంతో ప్రత్యేకమైనదని, అందుకే దీనిలో ఇన్నిప్రత్యేకతలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అందుకే దీని ధరను రూ.70 లక్షలుగా ఫైనల్ చేశానని తెలిపారు. ఈ మేక ఫొటోని సోషల్ మీడియా లో పెడితే దాన్ని చూసి నాగపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేసి దీనిని రూ.22 లక్షలకు కొనుగోలు చేస్తానని అన్నారని చెప్పారు. ఆ ఖరీదుకు నేను మేకను ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దీనికి మరింత ఎక్కువ ధర వస్తుందనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాలేదు. మా ఇంట్లో నేను, నా భార్య కాకుండా ఆరుగురు పిల్లలున్నారు. వారిలో ముగ్గురు ఆడ పిల్లలున్నారు. ఈ మేకను అమ్మిన డబ్బుతోనే నేను వారి పెళ్లిళ్లు చేయాలనుకుంటున్నట్లు మేక యజమాని వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)