తెలంగాణలోని ఘట్కేసర్ లో రెడ్ల సింహ గర్జన సభలో మంత్రి మల్లారెడ్డి ప్రభుత్వ పథకాలపై మాట్లాడుతూనే.. సభకు హాజరైన కార్యకర్తలు అడ్డుపడడంతో స్పీచ్ ను మధ్యలోనే ఆపి వెనుదిరగడంతో కాన్వాయ్ పై రాళ్లు, కుర్చీల విసిరారు. విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ పరోక్షంగా దాడిని ఖండించారు. మరణం, జీవితం అందరికీ తెలుసు అని కానీ చిన్న చిన్న వాటి మీద రచ్చ చేయడం మానుకోవాలని ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఏది మనల్ని బంధిస్తుంది.. ఏది విభజిస్తుంది అనే దానిని విశ్లేషణ చేయాలని సూచించారు. మరణం యొక్క సర్వవ్యాప్తి , జీవితం యొక్క అనిత్యత అందరికీ తెలుసు. ఇంకా చిన్న చిన్న పనికిమాలిన మాటల మీద రచ్చ చేస్తూనే ఉన్నాం ఏది మనల్ని విభజిస్తుంది మరియు ఏది కలిసి బంధిస్తుంది అనే దాని గురించి మనం ఎందుకు నిమగ్నమై ఉన్నాము అని ఆశ్చర్యపోతున్నారా ? #సోమవారం ఆలోచనలు.. అంటూ ట్వీట్ చేశారు.
మల్లారెడ్డి పై దాడిని ఖండిస్తూ కేటీఆర్ ట్వీట్
May 30, 2022
0
Tags