జార్ఖండ్‌కు డబ్ల్యూహెచ్‌వో అవార్డు

Telugu Lo Computer
0


పొగాకు వినియోగాన్ని నియంత్రిచడంలో జార్ఖండ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.  పొగాకు వినియోగాన్ని తగ్గించడంలో చేసిన కృషికి గానూ 'వరల్డ్ నో టొబాకో డే అవార్డు-2022'కు జార్ఖండ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపిక చేసింది. ఆదివారం ఈ విషయాన్ని ఓ అధికారి వెల్లడించారు. మంగళవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును అందజేయనున్నారు. 'జార్ఖండ్‌కు ఇది గొప్ప విజయం. పొగాకు నియంత్రణ విభాగం ఈ కార్యక్రమాన్ని అమలు చేయడంలో రాజకీయ, పరిపాలనా మద్దతుల వల్ల మాత్రమే సాధ్యమైంది' అని జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమ ప్రాంతీయ అధికారి రంజన్ పాఠక్ తెలిపారు. గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే (జీఏటీఎస్)-1 నివేదిక ప్రకారం, 2012లో జార్ఖండ్‌లో పొగాకు నియంత్రణ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రంలో పొగాకు తాగేవారి రేటు 51.1 శాతం ఉన్నారు. ఇక 2018లో ఈ సంఖ్య 38.9కు చేరగా, ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మరింతగా తగ్గిందని రంజన్ చెప్పారు. జార్ఖండ్‌లో పొగాకు వ్యాప్తి రేటును తగ్గించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, డబ్ల్యూహెచ్‌వో, అంకితమైన రాష్ట్ర, జిల్లా ఆరోగ్య బృందాలు చాలా సహకరించాయని ఆయన అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)