సెక్స్ వర్కర్లను ఏవిధంగానూ కూడా వేధించరాదని పోలీసులు, మీడియాను సుప్రీంకోర్టు ఆదేశించింది. స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదంటూ దేశ సర్వన్నోత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులు, మీడియా పబ్లిషర్లకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెక్స్ వర్కర్ల వ్యభిచారాలపై దాడులు జరిపిన సమయంలో పట్టుబడిన సెక్స్ వర్కర్ల ఫొటోలను ఎట్టిపరిస్థితుల్లోనూ మీడియా టెలిక్యాస్ట్ చేయరాదని సుప్రీం స్పష్టం చేసింది. అందరిలానే.. సెక్స్ వర్కర్లకు కూడా కనీస గౌరవ మర్యాదలు ఇవ్వాలని సూచించింది. సెక్స్ వర్కర్లపై భౌతికంగా గానీ మాటలతో వేధించడం గానీ చేయరాదని సూచించింది. వారిపట్ల పోలీసులు కనీస మర్యాదగా ఉండాలంటూ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఏ మీడియా లేదా పబ్లిషర్లు వారి ఫొటోలు ప్రచురించినా గుర్తింపును వెల్లడించినా ఐపీసీ 354C ప్రకారం చర్యలు తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీనికి సంబంధించి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తగిన మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్టికల్ 142 ఆధారంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ ఉత్తర్వులను ఇచ్చింది. సెక్స్ వర్కర్లకు సంబంధించి నియమించిన కమిటీ ఇచ్చిన కీలక సిఫార్సులను సుప్రీంకోర్టు ఆమోదించింది. సెక్స్ వర్కర్లకు సంబంధించి సిఫార్సులపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయాలని సుప్రీం ఆదేశాల్లో పేర్కొంది.
సెక్స్ వర్కర్లను వేధించొద్దు !
May 26, 2022
0
Tags