ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ మొబైల్ దుకాణదారుడు రూ.10 వేలకుపైగా విలువైన సెల్ ఫోన్ కొంటే లీటరు పెట్రోలు ఫ్రీ అంటూ బోర్డు పెట్టా డు . దేశంలో పెట్రోలు, నిమ్మకాయల ధరలు పెరిగిపోతోన్న నేపథ్యంలో మొబైల్ షాపు యజమాని వాటినే ఆఫర్లుగా ప్రకటించాడు. దీంతో ఆయన దుకాణానికి కష్టమర్ల ఎగబడుతున్నారట. వారణాసిలోని మొబి వరల్డ్ షాప్ దుకాణదారుడు చేసిన ఈ ప్రకటనకు సంబంధించి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేసవి ప్రత్యేక ఆఫర్లుగా అతడు తన స్టోర్‌లో రూ.10 వేలకుపైగా విలువైన ఫోన్లను కొనుగోలు చేస్తే లీటరు పెట్రోలు చొప్పున ఉచితంగా ఇస్తానని పేర్కొన్నాడు. అలాగే, మొబైల్ ఫోన్ యాక్సెసరీస్‌పై 5 నిమ్మకాయలు ఇస్తానని బోర్డులు పెట్టాడు.
సెల్ ఫోన్ కొంటే పెట్రోల్, యాక్సెసరీస్‌పై నిమ్మకాయలు ఫ్రీ !
April 21, 2022
0
Tags