ఢిల్లీలో గతకొద్ది వారాలుగా భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ మ్యూటెంట్ వేరియంట్ కారణమని భావిస్తున్నారు. అయితే.. ఇప్పుడా ఆ ఒమిక్రాన్ మ్యూటెంట్ అయ్యి మరో కొత్త వేరియంట్ గా రూపాంతరం చెందినట్టు సైంటిస్టులు భావిస్తున్నారు. ఢిల్లీలో కరోనా బారినపడిన బాధితుల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. వారిలో ఒమిక్రాన్ కొత్త BA.2. 12.1 మ్యూటెంట్ వేరియంట్ ఉందని నిర్ధారణ అయినట్టు ఓ నివేదిక వెల్లడించింది. ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2కు సంబంధించిన SARS CoV 2 కొత్త మ్యూటెంట్ వేరియంట్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఢిల్లీ చుట్టుపక్కల జిల్లాల్లో COVID-19 కేసుల పెరుగుదలకు ఈ కొత్త మ్యుటేట్ వేరియంట్ ప్రధాన కారణమని భారత కరోనావైరస్ జెనోమిక్ సర్వైలెన్స్ ప్రాజెక్ట్ INSACOG వర్గాలు తెలిపాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని NCDC డైరెక్టర్ సుజీత్ కుమార్ సింగ్ ఢిల్లీలో Omicron BA.2.12.1 వేరియంట్‌ను గుర్తించినట్లు ధృవీకరించారు. ఈయన INSACOG ప్రాజెక్ట్‌కు నేతృత్వం వహిస్తున్నారు. అయితే ఈ వేరియంట్ కు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించలేదు. గత కొన్ని రోజులుగా ఈ వేరియంట్ బారినపడిన అనేక మంది బాధితుల నమూనాలను పరీక్షిస్తున్నారు. వారిలో ఎక్కువమందిలో BA.2.12.1 వేరియంట్ గుర్తించామని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కరోనా కొత్తవేరియంట్లలో BA.2.12.1, BA.2.12తో పాటు, Omicron BA.2 సబ్‌వేరియంట్ కేసులను న్యూయార్క్‌లోని US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) ఇప్పటికే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో గుర్తించారు. ఈ వేరియంట్ క్రమంగా మ్యుటేట్ చెంది మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని సైంటిస్టులు సైతం హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలోని కరోనా బాధితుల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో BA.2.12.1 ఉందని నిర్ధారించినట్టు NCDCలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఢిల్లీ కరోనా బాధితుల్లో ఒమిక్రాన్ మ్యూటెంట్ వేరియంట్
April 21, 2022
0
Tags