భారత్ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నేడు అహ్మదాబాద్ చేరుకున్నారు. లండన్ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా గుజరాత్‌లోని అహ్మబాద్‌లో అడుగుపెట్టారు. ఆయనకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అధికారులు సాదర స్వాగతం పలికారు. పారిశ్రామిక, వ్యాపారవేత్తలో బోరిస్ సమావేశం కానున్నారు. భారత్- బ్రిటన్ వాణిజ్య, ప్రజా సంబంధాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా పరిశ్రమల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై, వైద్య, శాస్త్ర రంగాల్లో కలిసి పనిచేయడంపై ప్రకటన చేయనున్నారు. అనంతరం ఢిల్లీకి పయణమవుతారు. బోరిస్ జాన్సన్ భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. బ్రిటన్‌లో ఉన్న భారతీయుల్లో అత్యధికులు గుజరాత్‌కు చెందినవారే కావడంతో ఆయన నేరుగా అహ్మద్‌బాద్ వచ్చారు.
అహ్మదాబాద్ చేరుకున్న బోరిస్ జాన్సన్
April 21, 2022
0
Tags