ఈరోజు రాత్రి 9.30గంటలకు ఎర్రకోట వేదికగా మోడీ ప్రసంగం

Telugu Lo Computer
0


గతంలో ఎప్పుడూలేని విధంగా సూర్యాస్తమయం తరువాత రాత్రి 9.30 గంటలకు ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సిక్కు గురువు గురుతేజ్ బహదూర్ 400 జయంతి సందర్భంగా ఎర్రకోటలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా పాల్గోనున్నారు. మతసామరస్యంపై ప్రధాని ప్రసంగించనున్నారు. అదే విధంగా తేజ్ బహదూర్ జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంపు, నాణేన్నిమోడీ విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, విదేశీ ప్రముఖులతో పాటు నాలుగు వందల మంది సిక్కు సంగీతకారులు పాల్గొంటారు. ప్రధాని నరేంద్రమోడీ రానుండటంతో ఎర్రకోట వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. వెయ్యి మందికిపైగా ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. రెండురోజుల క్రితం హనుమాన్‌ శోభాయాత్ర సందర్భంగా ఢిల్లీలో చెలరేగిన హింస నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎర్రకోటలో వందకుపైగా సీసీటీవీల ఏర్పాటు చేశారు. మరోవైపు దేశ రాజధానిలో కోవిడ్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో భౌతిక దూరం నిబంధనలను పాటించడం తప్పనిసరి అని అధికారులు పేర్కొంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)