రివర్స్ రెపో ను 3.75 గా మార్చిన ఆర్బీఐ

Telugu Lo Computer
0


ఆర్బీఐ కీలకమైన వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. గత 11 సమీక్షల్లో ఎప్పుడూ ఆర్బీఐ వడ్డీ రేట్లను మార్చలేదు. అయితే ద్రవ్య లభ్యతను పెంచాలన్న ఉద్దేశంతో 3.25 గా రివర్స్ రెపో ను 3.75 గా మార్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. కరోనా టైమ్ లో మార్కెట్లోకి ద్రవ్య లభ్యత మెరుగుపర్చాలని వడ్డీ రేట్లను మార్చలేదు. కరోనా ఎఫెక్ట్ తగ్గినప్పటికీ ఇప్పటి ఆర్బీఐ అదే రేట్లను కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ ఆర్బీఐ వడ్డీ రేట్ల జోలికి పోలేదు. అటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ మాత్రం పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను పెంచుతామని స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)