దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,109 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,30,33,067కి పెరిగింది. కరోనా వైరస్ నుంచి తాజాగా 1213 మంది కోలుకోవడంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,492కు క్షీణించింది. గడచిన 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా మరో 43 మంది మరణించడంతో ఇప్పటివరకు కరోనా వైరస్‌తో మరణించిన వారి సంఖ్య 5,21,573 కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటివరకు 1,85,38,88,663 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, నిన్న ఒకేరోజు 16,80,118 మందికి వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది.
దేశంలో కొత్తగా 1109 కరోనా కేసులు నమోదు
April 08, 2022
0