ఒడిశాకు చెందిన మాజీ కేబినెట్ మంత్రి, అధికార బిజూ జనతాదళ్ శాసనసభ్యుని కుమారుడు పంచాయతీ ఎన్నికలలో ఓటమిపాలయ్యారు. కూరగాయల వ్యాపారి కుమారుడు, దంత వైద్య విద్యార్థి చేతిలో అనుహ్యంగా ఓడిపోయారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో ఇద్దరు పోటీ చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకురాలు, రాష్ట్ర మాజీ మంత్రి అంజలీ బెహెరా ఢెంకనల్ జిల్లాలోని హిందోల్ బ్లాక్ పరిధిలోని గిరిధర్ ప్రసాద్ గ్రామ పంచాయతీ నుండి పంచాయితీ సమితి సభ్యుని స్థానానికి పోటీ చేసి 826 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బెహెరా , హిందోల్ స్థానం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో 2009-2012 వరకు మంత్రిగా కూడా పని చేశారు. ప్రభుత్వంలో మహిళా, శిశు అభివృద్ధి, చేనేత, జౌళి, హస్తకళల మంత్రిగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆమెను బీజేడీ నుంచి తొలగించారు. దీంతో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు.
కూరగాయల వ్యాపారి కొడుకు చేతిలో ఓడిన ఎమ్మెల్యే కొడుకు!
March 02, 2022
0
Tags