పిల్లలు ఎప్పుడు కావాలనుకుంటామో అప్పుడే కంటాము!

Telugu Lo Computer
0


ఉపాసన కొణిదెల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో యాంకర్ పిల్లల ప్రస్తావన తెచ్చినప్పుడు ఉపాసన ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఉపాసన మాట్లాడుతూ.. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం, మాకు పిల్లలు ఎప్పుడు కావాలి అనుకుంటామో అప్పుడే మేము పిల్లల్ని కంటాము అని, మాకు ఏమైనా వయసు అయిపోయిందా, అయినా మా వ్యక్తిగత విషయాల గురించి మీకెందుకు, నాకంటూ జీవితంలో కొన్ని గోల్స్ ఉన్నాయి. అవన్నీ నెరవేరిన తర్వాతనే పిల్లల్ని కోరుకుంటాను అని నేను ఇంట్లో చెప్పిన తర్వాత నా నిర్ణయాన్ని రామ్ చరణ్ తో పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అభినందించారు. దయచేసి మా వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడకండి అంటూ బదులిచ్చింది.మీరు చేసే పనుల మీద శ్రద్ధ చూపిస్తే బెటర్ అంటూ ఉపాసన చాలా ఘాటుగానే సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఉపాసన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ దుమారం రేపుతున్నాయి. త్వరలోనే మీ అందరికీ మరో శుభవార్త చెబుతానంటూ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి

Post a Comment

0Comments

Post a Comment (0)