ఉక్రెయిన్ రాజధాని కీవ్ సిటీ నుంచి బయటకు పడేందుకు ప్రయత్నిస్తుండగా భారత విద్యార్థిపై కాల్పులు జరిగాయి. దీంతో బుల్లెట్ గాయాలైన ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ ధ్రువీకరించారు. కీవ్ నుంచి ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకునేందుకు బయలుదేరిన భారత విద్యార్థిపై కాల్పులు జరిగినట్లు తనకు సమాచారం అందిందని ఆయన చెప్పారు. ఆ స్టూడెంట్ ను వెంటనే ఆస్పత్రిలో చేర్చారన్నారు. కీవ్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టాప్ ప్రయారిటీతో అక్కడి వారిని వేగంగా తరలిస్తున్నామని వీకే సింగ్ చెప్పారు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఏ ఒక్క దేశం వారినో, ఏ ఒక్క మతం వారినో టార్గెట్ చేసి ఒక గన్ బుల్లెట్ దూసుకురావడం జరగదని ఆయన అన్నారు. ఈ ఘటన జరగకుంటే ఆ విద్యార్థి పోలాండ్ సరిహద్దుకు చేరుకోవాల్సిందని చెప్పారు.
ఉక్రెయిన్‌లో భారత విద్యార్థికి బుల్లెట్ గాయాలు
March 04, 2022
0
Tags