'ది కాశ్మీర్ ఫైల్స్'కు అడ్వాంటేజ్‌గా మారింది. కశ్మీర్ లో హిందూ పండిట్ల మీద జరిగిన అఘాయి త్యాల నేపథ్యంలో సీనియర్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ఈ చిత్రానికి చాలా మంచి రివ్యూలు వచ్చాయి. అంతకు మించి సినిమా చూసిన ప్రేక్షకుల మౌత్ టాక్ బాగా కలిసొచ్చి సినిమా వేగంగా జనాల్లోకి వెళ్లిపోతోంది. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు స్క్రీన్లు, షోల సంఖ్య, బుకింగ్స్, వసూళ్లు ఇలా అన్నీ పెరిగిపోయాయి. శనివారం నాటికి ఇది కల్ట్ మూవీ స్టేటస్ సంపాదించింది. ఇప్పుడు సినిమాకు నార్త్ ఇండియా టికెట్లు దొరకని పరిస్థితి తలెత్తింది. రిలీజైన మూడో రోజు, ఆదివారం.. ఉదయం 6-6.30 మధ్య షోలు మొదలుపెట్టడం విశేషం. ఈ సినిమా కోసం డిమాండ్ ఆ స్థాయిలో పెరిగిపోయింది. దక్షిణాదిన కూడా ఈ సినిమాకు ఆదరణ పెరుగుతోంది.
ప్రకంపనలు రేపుతున్న ది కాశ్మీర్ ఫైల్స్
March 13, 2022
0
Tags