బైక్‌ను లారీ ఢీకొని దంపతుల మృతి

Telugu Lo Computer
0


తెలంగాణ లోని కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం జలాల్‌పూర్‌కు చెందిన బేగరి లక్ష్మయ్య (42), ఆయన భార్య చిత్రమ్మ(38) శనివారం నిజాంపేట వైపు నుంచి తమ స్వగ్రామమైన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం జలాల్‌పూర్‌కు బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో జాతీయ రహదారికి చెందిన ఫ్లైఓవర్‌ బ్రిడ్జి మీదుగా వెళ్తుండగా, రాంగ్‌ రూట్లో ఉన్నట్లు గ్రహించి తిరిగి యూటర్న్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నాందేడ్‌ వైపు నుంచి హైదరాబాద్‌ వైపు వస్తున్న లారీ వీరి బైక్‌ను ఢీ కొన్నది. ఈ ఘటనలో బైక్‌పై వెనక ఉన్న బేగరి చిత్రమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, బైక్‌ నడుపుతున్న బేగరి లక్ష్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మయ్యను జాతీయ రహదారులకు చెందిన ఆంబులెన్స్‌లో నారాయణఖేడ్‌ వైద్యశాలకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నారాయణఖేడ్‌ రెండో ఎస్‌ఐ మొగులయ్య హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్‌ ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)