కారు దొంగతనాన్ని అడ్డుకోబోయి ప్రాణం కోల్పోయాడు!

Telugu Lo Computer
0


అమెరికాలోని వాష్టింగ్టన్‌ డీసీలో ఓ ఆస్పత్రిలో రాకేశ్‌ పటేల్‌ డాక్టర్‌గా పని చేస్తున్నాడు. నగరంలో ఉన్న తన గర్ల్‌ఫ్రెండ్‌ని కలిసేందుకు వెళ్లాడు. అక్కడ ఆమెకు కొన్ని వస్తువులు అందించి వెనక్కి తిరగ్గా, తన కారులో మరెవరవో ఉన్నట్టు రాకేశ్‌ గుర్తించాడు. వెంటనే కారు వైపుకు నడిచాడు. రాకేశ్‌ రావడం గమనించిన కారులోని అగాంతకుడు కారుతో వేగంగా రాకేశ్‌ని ఢీ కొట్టాడు. ఆ తర్వాత అతనిపై నుంచి కారుని పోనిచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన రాకేశ్‌ని వెంటనే ఆస్పత్రికి తరలించినా అతని ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటనలో దుండగుడు రాకేశ్‌కి చెందిన మెర్సిడెజ్‌ బెంజ్‌ కారుని దొంగలించడంతో పాటు అతని ప్రాణాలు బలిగొన్నాడు. ఈ దుర్ఘటనకు కారణమైన నిందితుడిని పట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని వాష్టింగ్టన్‌ పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఓహియోలో ఉన్న రాకేశ్‌ తల్లిదండ్రులు వాషింగ్టన్‌కి పయణమయ్యారు. కళ్లెదుటే జరిగిన దారుణం చూసిన రాకేశ్‌ పటేల్‌ గర్ల్‌ఫ్రెండ్‌ ఇంకా షాక్‌లోనే ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)