ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎంను కష్టాలు వీడట్లేదు. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ను జారీ చేసినప్పటి నుంచీ అన్ని రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటోందా కంపెనీ. నష్టాల్లో కునారిల్లుతోంది. పేటీఎం షేర్ల ధరలు పాతాళానికి పడిపోయాయి. ఇన్వెస్టర్లకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పట్లో ఈ షేర్ల ధరలు పైపైకి ఎగబాకే అవకాశాలే కనిపించట్లేదు. మరిన్ని నష్టాలను చవి చూడకుండా ఉండటానికి ఇన్వెస్టర్లు పేటీఎం షేర్లను పెద్దఎత్తున విక్రయించుకున్నారు. తాజాగా పేటీఎం వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ శేఖర్ శర్మ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. మితిమీరిన వేగంతో వాహనాన్ని ఢిల్లీ సౌత్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ బెనీత మేరీ జైకర్ వాహనాన్ని ఢీ కొట్టారు. ఈ ఘటనలో విజయ్ శేఖర్ శర్మపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు.
Post a Comment
0Comments
3/related/default