పాకిస్థాన్‌లో పెషావర్‌లో భారీ పేలుడు ఘటనలో 30 మంది వరకు మృతి చెందగా, 50 మందికి పైగా గాయాలైనట్లు జియో న్యూస్ తెలిపింది.షియా మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతోన్న వేళ ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడుకు ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. పెషావర్‌లోని కిస్సా ఖ్వానీ బజార్‌లో ఉన్న జామియా మసీదే లక్ష్యంగా ఈ పేలుడు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ప్రార్థనలు జరుగుతోన్న సమయంలోనే పక్కా ప్లాన్ ప్రకారం ఈ దాడి చేసినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ముందుగా ఇద్దరు దుండగులు తుపాకీలతో మాస్కులోకి ప్రవేశించేందుకు యత్నించారని పోలీసులు వెల్లడించారు. కాపాలాగా ఉన్న పోలీసుపై కాల్పులు చేయగా అధికారి అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత పేలుడు జరిగిందన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
భారీ పేలుడులో 30 మంది మృతి
March 04, 2022
0
Tags