దేశంలో కరోనా ప్రభావం క్రమేపీ తగ్గుతూ రెండు వేల లోపు కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 1500 దిగువకు కరోనా కేసులు తగ్గటం విశేషం. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,421 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 149 మంది కరోనా తో చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 1826 మంది కరోనా నుంచి కోలుకోగా వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.24 కోట్లు దాటింది. రికవరీ రేటు 98.75 శాతానికి పెరిగింది. అటు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ 183 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు.
దేశంలో కొత్తగా 1421 కరోనా కేసులు నమోదు
March 27, 2022
0