ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఆదివారం అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. పొందూరు సమీపంలో పొదవారిపాలెం వద్ద మూసీ వాగులో వారి మృత దేహాలు లభ్యమయ్యాయి. మృతులు పిడుగురాళ్ల వాసు(15), చెంచు మహేష్(13), లింగతోటి జగన్( 12) గా గుర్తించారు. క్రికెట్ ఆడేందుకు వెళ్లిన ఈ ముగ్గురు మూసీ వాగులో ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు. ఇసుక కోసం తవ్విన గోతుల్లో చిక్కుకొని మునిగిపోయారు. పిల్లలు ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు ఆందోళనతో వెతకడం ప్రారంభించారు. ఉదయం మూసీ వాగు నీటి గుంటల్లో వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికుల సాయంతో ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు
ముగ్గురు విద్యార్థులు మృతి
February 28, 2022
0
Tags