పవన్ కల్యాణ్ గారే నన్ను సెలెక్ట్ చేశారు

Telugu Lo Computer
0


ఖుషి సినిమాలో తాను చేసిన సీన్ మొత్తం పవన్ కల్యాణ్ గారే డైరెక్ట్ చేశారని ప్రముఖ సినీ నటుడు అజయ్ తెలిపారు. శ్రీధర్ రెడ్డి మాస్టార్ అనే వ్యక్తి సెలెక్షన్స్ ఉన్నాయి రమ్మని అంటే, నేను మెయిన్ విలన్ అయితేనే చేస్తానని ఆయనతో అన్నానని అజయ్ చెప్పారు. అప్పటికే కౌరవుడు అనే సినిమాలో చేసి ఉన్నానని, దాంతో తనకు అవకాశాలు వస్తాయనే మూడ్‌లోకి వెళ్లిపోయానని ఆయన అన్నారు. కానీ ఎలాంటి అవకాశాలు రాలేదని, శ్రీధర్ రెడ్డి గారి బలవంతంతోనే ఖుషి సినిమా సెలక్షన్స్‌కు వెళ్లానని ఆయన చెప్పుకొచ్చారు. అక్కడికొచ్చిన తనతో పాటు 11మంది టీమ్‌ను పవన్ కల్యాణ్ గారే సెలెక్ట్ చేశారని ఆయన అన్నారు. మా నాన్నకు తాను ఇంజినీర్ కావాలని ఉండేదని, కానీ తనకు మాత్రం అసలు ఏమవ్వాలనే కన్‌ఫ్యూజన్ ఉండేదని ఆయన చెప్పారు. తాను జూబ్లీహిల్స్‌లో ఉన్నపుడు షూటింగ్స్ చూసేవాడినన్న ఆయన, అసలు తనకు యాక్టర్ అవ్వాలన్న ఆలోచన ఎప్పుడొచ్చిందో కరెక్టుగా తెలియదని చెప్పారు. తాను ఇంజినీరింగ్ చేశానని కానీ అది వర్కవుట్ కాలేదని, దాంతో హోటల్ మేనేజ్‌మెంట్ కూడా చేశానని అజయ్ అన్నారు. ఆ తర్వాత మధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరానని ఆయన చెప్పారు. అప్పటికీ తనకు అసలు ఏమవ్వాలనే దానిపై స్పష్టత లేదని అజయ్ చెప్పారు. తాను ఇంత వరకూ రావడానికి ఇబ్బందులు పడలేదని చెప్పనని, కానీ ఎలాంటి పని చేయాలన్నా, ఏం చేయాలన్నా ప్రతీ దాంట్లోనూ ఇబ్బందులుంటాయని ఆయన తెలిపారు. మనకు ఇష్టపడి వచ్చాము కాబట్టి కచ్చితంగా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. షూటింగ్స్ చూస్తున్నపుడు అక్కడ యాక్టర్స్‌కి పట్టే గొడుగు, ఇచ్చే జ్యూస్ చూసి అవి అంత తొందరగా రావని తనకు తర్వాత అర్థమైందని తెలిపారు. నిజం చెప్పాలంటే ఆ రెండే తనను ఇక్కడి వరకు తీసుకొని వచ్చాయని అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)