కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు

Telugu Lo Computer
0



దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మంగళవారం నుంచి పెరిగింది. మార్చి 1 నుంచి ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ల ధరను రూ.105 పెంచారు.ఈ పెంపుతో మంగళవారం నుంచి ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,012 కానుంది. 5 కిలోల సిలిండర్ ధర కూడా 27 రూపాయలు పెరిగింది. ఇప్పుడు 5 కిలోల సిలిండర్ ధర ఢిల్లీలో 569 రూపాయలు. దేశీయ ఎల్పీజీ సిలిండర్‌ ధర పెరగ లేదు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య సిలిండర్ రేటు నెలవారీగా సవరించనున్నారు. నేషనల్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఫిబ్రవరి 1న 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.91.50 తగ్గించాయి.గత నెల1వతేదీన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర తగ్గించగా, సరిగ్గా నెలరోజుల తర్వాత మళ్లీ 105రూపాయలు పెంచింది. దీంతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)