ఇష్టమైన డ్రెస్ ధరించే హక్కు మహిళలకు ఉంది

Telugu Lo Computer
0


కర్ణాటకలో హిజాబ్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఎంతోమంది ప్రముఖులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈక్రమంలో'హిజాబ్ ధరించే హక్కుందంటూ కాంగ్రెస్ జాతీయ నేత ప్రియాంక గాంధీ సైతం హిజాబ్ వివాదంపై ఘాటుగా స్పందించారు. యువతులకు, మహిళలకు వారికి ఇష్టమైన డ్రెస్ ధరించే హక్కు ఉంది అంటూ విద్యార్ధినులకు ప్రియాంకా మద్దతు ఇచ్చారు. ఎటువంటి దుస్తులు ధరించాలో నిర్ణయించుకోవడం మహిళల హక్కు అని..భారత రాజ్యాంగమే ఆ హక్కుకు హామీ ఇస్తున్నదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. మహిళలు తాము బికినీ వేసుకోవాలా, ఘూంగ్‌హట్ (చీర కొగుతో ముసుగు) పాటించాలా, జీన్స్ వేసుకోవాలా? లేక హిజాబ్ ధరించాలా అనేది ఆమె ఇష్టాన్ని బట్టే నిర్ణయించుకునే హక్కుందని స్పష్టం చేశారు. వస్త్రధారణ విషయంలో అమ్మాయిలపై ఆంక్షలు విధించటం మానుకోవాలని, వారు ధరించి దుస్తుల విషయంలో వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ప్రోత్సాహం కోసం కాంగ్రెస్ ఇచ్చిన 'లడ్కీ హు.. లడ్ సక్తీ హు. నినాదాన్ని కర్ణాటక హిజాబ్ నిరసనలకు సైతం జోడించారు ప్రియాంక. హిజాబ్ వివాదంపై ప్రియాంక సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తదితరులు ఆందోళన చేస్తున్న విద్యార్థినులకు మద్దతిచ్చారు. హిజాబ్ ధరించారనే సాకుతో అమ్మాయిలను చదువుకు దూరం చేయాలనుకుంటే సహించేది లేదని హెచ్చరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)