దేశంలో లక్ష లోపు కరోనా కేసులు నమోదు అయ్యాయి. కానీ నిన్నటి కంటే ఇవాళ 4 వేల కేసులు ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 71,365 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,10,976 కు చేరింది. యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 8,92,828 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. తాజాగా 1,217 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,05,279 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,72,211 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,10,12,869 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,70,87,06,705 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 53,61,099 మందికి కరోనా వ్యాక్సిన్లు ఆరోగ్య శాఖ వేసింది.
దేశంలో కొత్తగా 71 వేల కరోనా కేసులు నమోదు!
February 09, 2022
0
Tags