ఆడపిల్ల పుడితే ఆర్థిక సాయం

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్లకు చెందిన యువకులు ఓ మంచి కార్యక్రమం చేపట్టారు. ఊళ్లో ఆడపిల్ల పుడితే రూ.11,116 చొప్పున ఆర్థికసాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 19 మంది ఆడపిల్లలకు రూ.2,11,204లను వారి తల్లిదండ్రులకు అందజేశామని చెప్పారు. దీనికి 'అభయహస్తం' అనే పేరు పెట్టారు. ఇందుకోసం గ్రామ యువకులంతా కమిటీగా ఏర్పడి డబ్బు జమచేసుకుంటున్నారు. కొందరు దాతలు కూడా ఈ మంచి పనిలో భాగమవుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)