కొవిడ్ బారిన పడిన కౌసల్య!

Telugu Lo Computer
0


ప్రముఖ గాయని కౌసల్యకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'నాకు కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ మహమ్మారి లక్షణాలు తీవ్రంగానే ఉన్నాయి. రెండు రోజుల నుంచి జ్వరంగా ఉంది. కనీసం బెడ్‌పై నుంచి కూడా లేవలేకపోతున్నాను. ఇప్పుడు గొంతు నొప్పి మరింత ఇబ్బంది పెడుతోంది. నిన్నటి నుంచి మందులు తీసుకోవడం మొదలుపెట్టాను. త్వరలోనే ఈ వైరస్ ను ఓడించి మీ ముందుకు వస్తాను. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి' అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు కౌసల్య. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. 'టేక్ కేర్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)