పాకిస్తాన్ లో బాంబు పేలుడు : ఇద్దరు మృతి

Telugu Lo Computer
0


పాకిస్తాన్ లోని లాహోర్ లహరీ గేట్ వద్ద భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందగా, మరో 20 మందికి గాయాలు అయ్యాయి. అనార్కలీ బజార్ లో బాంబు పేలుడు సంభవించింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుడు ప్రాంతాన్ని అక్కడి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పేలుడు ఘటనపై విచారణ జరుపుతున్నామని లాహోర్ డీఐజీ పేర్కొన్నారు. ఐఈడీ పేలుడా? టైమ్ బాంబా అనే దానిపై ప్రస్తుతం విచారణ మొదలుపెట్టినట్లుగా తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)