ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. అప్పటి నుంచి దాదాపు చాలా జిల్లాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి జిల్లా కడపలోనూ అలజడి పెరిగింది. రాజంపేట పార్లమెంట్ పరిధిని అన్నమయ్య జిల్లాగా నామకరణం చేసి ఏపీ ప్రభుత్వం జిల్లా కేంద్రాన్ని రాయచోటిని ప్రకటించడం వివాదాస్పదంగా మారుతోంది. అన్నమయ్య జిల్లాలో మొత్తం ఆరు నియోజకవర్గాలు ఉండనున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, చిత్తూరు జిల్లా లోని పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లెలు ఉన్నాయి. పార్లమెంట్ పరిధిలోని వైశాల్యం 8,459 చ.కి.మీ ఉండగా.. జనాభా లెక్కల ప్రకారం 17.68 లక్షలు మంది ఉన్నట్లు అంచనా. ఇదంతా బాగానే ఉన్న జిల్లా కేంద్రంపై ఎంపికపై ప్రస్తుతం వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలనీ డిమాండ్ నెలకొంటుంటే.. మరోవైపు మాధనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలన్నా వాదన... నిరసనలు., ధర్నాలు చేస్తున్నారు ప్రజలు. వీరి ప్రతిపాదనపై అధికార పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. దింతో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. అన్నమయ్య జిల్లాకు రాజంపేటను కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు రాజంపేట వాసులు. తమ నిరసనను సీఎం వరకు తెలియజేయటానికి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. వైసీపీ ఆవిర్భావం నుంచి కంచుకోటల్లా ఉన్న ప్రధాన గ్రామాల్లో 'వైసీపీకి ఇక సెలవు' అంటూ హైవేలపై హోర్డింగ్‌లు పెట్టేస్తున్నారు. ఫ్లెక్సీలు పెట్టిన ప్రతి గ్రామంలో గత ఎన్నికల్లో వైసీపీ నాయకులు భారీ మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ నాయకులు మా పల్లెలోకి రావోదంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి., కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు నియోజకర్గాల్లో కనిపించడం లేదని.. వీరి ఆచూకీ తెలియజేయాలి అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఆ పోస్టింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అన్నమయ్య జన్మస్థలం, పార్లమెంట్, రెవెన్యూ డివిజన్ కేంద్రమైన రాజంపేటను జిల్లా కేంద్రం చేయకుండా కనీసం మంచినీళ్లు దొరకని రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం ఏంటంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా రాజంపేటకు సమీపంలోని కడప-చెన్నై హైవే పక్కనున్న వైసీపీకి, ప్రధానంగా సీఎం జగన్ కుటుంబానికి కంచుకోటైన రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లె ముఖద్వారం వద్ద ఆ గ్రామస్థులు భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.. "జిల్లాల విభజన వంచనకు నిరసనగా బరువెక్కిన హృదయాలతో వైఎస్సార్‌సీపీకి ఇక సెలవు. రాయచోటి వద్దు-రాజంపేట ముద్దు'' అంటూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. అశాస్త్రీయంగా జిల్లా కేంద్రం ఏర్పాటు మదనపల్లె జిల్లా ఆకాంక్ష బలంగా ప్రభుత్వానికి చేరాలంటే పార్టీలు, జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి రోడ్డు పైకి రావాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిస్తున్నారు. బలమైన రెవెన్యూ డివిజన్ అయినా మదనపల్లెను కాదని వేరొక ప్రాంతాన్నీ ఎలా జిల్లా జిల్లాకేంద్రం చేస్తారంటూ.. విద్యార్థులు., మదనపల్లె డివిజన్ నాయకులూ రోడ్డెక్కరు. జనగనమనకు ప్రాణం పోసిన ప్రాంతం., ఎంతో చరిత్ర కలిగిన మదనపల్లె కాకుండా వేరొక ప్రాంతానికి జిల్లా కేంద్రంగా ఏర్పాటు సహించబోమంటున్నారు ఇక్కడి వాసులు. మదనపల్లె జిల్లా కోసం మున్సిపల్ కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భారతీయ అంబేద్కర్ సేన, జనసేన పార్టీ నాయకులను మదనపల్లె టౌన్ బ్యాంకు సర్కిల్ వద్ద పోలీసులు అరెస్టు చేశారుభారతీయ అంబేద్కర్ సేన అధికార ప్రతినిధి చందు ఆద్వర్యంలో మున్సిపల్ కార్యాలయం పైకెక్కి నిరసనగా చేపట్టడంతో పోలీసులు కష్టం మీద కిందకు దింపి పోలీసు స్టేషనుకు తరలించారు.మున్సిపల్ కార్యాలయం సమీపంలో టిడిపి, బియస్పీ, సిపిఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
కొత్త జిల్లాలపై వినూత్న నిరసనలు
February 01, 2022
0
Tags