ప్రేమ పేరుతో యువతి హత్య

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా కంబదూరు మండలం దేవరమాను క్రాస్- తిమ్మాపురం రోడ్డులోని ఉప్పరోనిగుట్ట వద్ద పొదల్లో ఇటీవల ఓ యువతి మృతదేహం లభ్యమైంది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు. ప్రాధమిక దర్యాప్తులో యువతి స్థానికంగా ఉండే నందినిగా గుర్తించారు పోలీసులు. డెడ్ బాడీకి పోస్ట్ మార్టంలో యువతి ఆరు నెలల గర్భవతిగా తేలింది. పోలీసులు నందిని ఫోన్ కాల్ డేటా ఆధారంగా విచారణ మొదలుపెట్టారు. ఆమె చివరిసారిగా ఫోన్ లో మాట్లాడిన స్నేహితురాలిని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నందిని కనగానపల్లె మండలం భానుకోటకు చెందిన నరేష్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు ఆమె చెప్పింది. దీంతో నరేష్ కోసం పోలీసులు గాలించగా అతడు అప్పటికే పరారయ్యాడు. అయితే తన కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలిసి పోలీసులకు లొంగిపోయాడు. ఆ తర్వా త జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు తెలిపారు. తాను, నందిని గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు ఆ క్రమంలో  శారీరకంగా దగ్గరవడంతో నందిని గర్భం దాల్చిందని అప్పటి నుంచి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నట్లు వెల్లడించాడు. తనను పెళ్లి చేసుకోకుంటే పోలీసులకు ఫిర్యాదు చేసి, మరీ తాళికట్టించుకుంటానని బెదిరించిందని దీంతో ఎలాగైనా ఆమెను అడ్డుతొలగించుకోవాలని ఉద్దేశంతో ఆమెను ఉప్పరోని గుట్టవద్దకు తీసుకెళ్లి ఆమె నోట్లో బలవంతంగా పురుగుల మందు పోసి గొంతు నులిమి చంపినట్లు అంగీకరించాడు. దీంతో నరేష్ పై హత్యా నేరం కేసు నమోదు చేసిన పోలీసులు అతడ్ని రిమాండుకు తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)