కేంద్రం ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం (పీఎంజీకేవై) కింద ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియ గడువు 2022 మార్చి వరకు పొడిగించి కోటా విడుదల చేసినప్పటికీ రాష్ట్ర కోటాపై నిర్ణయం జరగలేదు. ఇప్పటి వరకు పీఎంజీకేవై కింద కేంద్రం యూనిట్‌కు అయిదు కిలోలు మాత్రమే కోటా కేటాయించినా.. రాష్ట్ర ప్రభుత్వం మరో అయిదు కిలోలు కలిపి యూనిట్‌కు 10 కిలోల చొప్పున లబ్ధిదారులకు పంపిణీ చేస్తూ వచ్చింది. తాజాగా కేంద్రం ఉచితం బియ్యం గడువు పొడిగించినా రాష్ట్ర ప్రభుత్వ మాత్రం కేంద్రం కోటాకే పరిమితమైంది. ఈ నెలలో ఉచిత బియ్యం కోటాను 5 కిలోలకు పరిమితం చేస్తూ పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది.
డిసెంబరులో రాష్ట్ర వాటా రేషన్ బంద్
December 07, 2021
0
Tags