షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి అలనాటి రంగస్థల, సినీ కథానాయిక. తెలుగు, తమిళ భాషల్లో 370 కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో సుమారు 200కి పైగా కథానాయికగా నటించిన సినిమాలు. ఈమె రేడియో నాటికల ద్వారా కెరీర్ ప్రారంభించారు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్. టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎం. జి. ఆర్, శివాజీ గణేశన్ మొదలైన నటుల సరసన కథానాయికగా నటించారు. ఈమె చెల్లెలు కృష్ణకుమారి కూడా సినీ నటి. బెంగళూరులో నివాసం. జీవిత భాగస్వామి. శంకరమంచి శ్రీనివాసరావు. జానకి 1931 సంవత్సరం డిసెంబరు 12న రాజమండ్రిలో జన్మించారు. అక్కడే పెరిగింది. తండ్రి టి. వెంకోజీరావు పేపర్ పరిశ్రమలో నిపుణుడు. ఈయన ఇంగ్లండులో మూడేళ్ళపాటు పేపర్ మ్యానుఫాక్చరింగ్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ చదివి వచ్చారు. తల్లి పేరు శచీదేవి. ఈమె అస్సాం గౌహతిలో మెట్రిక్యులేషన్ వరకు చదివింది. అరిజోనా విశ్వవిద్యాయంలో గౌరవ డాక్టరేట్ పొందింది. 15 ఏళ్ళకే పెళ్ళయింది. అనేక రంగస్థల నాటకాలలో కూడా నటించారు. తన 11వ యేటనే రేడియోలో ఒక తెలుగు కార్యక్రమంలో పాల్గొంది. ఈమె మొట్టమొదటి చిత్రం షావుకారు ఈమె ఇంటి పేరైపోయింది. ఈమె 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మళయాళం సినిమాలోను నటించారు. తెలుగు కథానాయకి కృష్ణకుమారి ఈమెకు స్వయానా చెల్లెలు. జాతీయ ఫిల్మ్ అవార్డులకు, తెలుగు సినిమా అవార్డులకు కమిటీలో జ్యూరీ సభ్యురాలిగా పనిచేశారు. ఈమె సత్యసాయిబాబా భక్తురాలు. విజయా ప్రొడక్షన్స్ వారి షావుకారు (1950) ఈమె మొదటి సినిమా. 1949లో రక్షరేఖ అనే సినిమాలో చంద్రికగా నటించారు. తరువాత ఆమె షావుకారు జానకిగా ప్రసిద్ధురాలయ్యింది. అనేక పురస్కారాలు పొందారు.
షావుకారు జానకి
December 12, 2021
0
Tags