దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

Telugu Lo Computer
0


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం  దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై విరుచుకుపడుతోంది. ఈ తెల్లవారు జాము నుంచి ఏకధాటిగా అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ప్రకాశం, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కుండపోతగా వర్షం పడుతోంది. ఇప్పటికే కుంభవృష్టితో అల్లకల్లోలంగా మారిన తిరుపతి ఇప్పుడీ  వర్షాలతో మరింత అల్లాడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ వరదనీటితో నిండిపోయాయి. ఈ అల్పపీడనం వాయుగుండం మారుతుందని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తోన్నారు. సోమవారం ఇది వాయుగుండంగా మారుతుంది. 30 లేదా డిసెంబర్ 1వ తేదీన ఏపీ దక్షిణ ప్రాంతం, తమిళనాడు ఉత్తర తీర ప్రాంతం మధ్య తీరాని దాటొచ్చని అభిప్రాయపడుతున్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో గల అన్ని నీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. వరద నీటితో పోటెత్తుతున్నాయి. కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో అనంతపురం జిల్లాలో గల పేరూరు రిజర్వాయర్ 25 సంవత్సరాల తరువాత గరిష్ఠస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. పెన్నా నదిపై నిర్మించిన రిజర్వాయర్ ఇది. గరిష్ఠ నీటి మట్టానికి చేరుకోవడంతో ఒక గేటును ఎత్తి నీటిని దిగువకు వదిలివేస్తోన్నారు అధికారులు.

Post a Comment

0Comments

Post a Comment (0)