పాలకూర జ్యూస్‌ !

Telugu Lo Computer
0


పాలకూర శరీరానికి చాలా మంచిది. పాలకూరను సలాడ్ లేదా సూప్ రూపంలో తీసుకోవచ్చు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ ఇ , విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్‌తో పాటు కెరోటిన్, అమైనో ఆమ్లాలు, ఐరన్, అయోడిన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. దీని రుచి బాగుంటుంది. అందుకే ప్రతిరోజు పాలకూర జ్యూస్‌ తాగితే ఆరోగ్యానికి ఈ పోషకాలు అన్నీ అందుతాయి. పాలకూర రసం చేయడానికి 2 కప్పుల పాలకూరని కడిగి శుభ్రం చేసి కట్‌ చేయాలి. 1 ఆపిల్ తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. గ్రైండర్‌లో కొన్ని నీరు పోసి యాపిల్ ముక్కలు, పాలకూరని వేసి మక్పి పట్టండి. తర్వాత ఈ జ్యూస్‌కి నిమ్మకాయ రసం కలపండి. పండ్ల ముక్కలు మిగిలి ఉండకుండా చూసుకోండి. మిశ్రమం తర్వాత రసం వడకట్టండి. తాజా పాలకూర రసం సిద్ధంగా ఉంది. ఒక గ్లాసు పాలకూర రసం మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)