సాధన శివదాసాని !

Telugu Lo Computer
0


సాధన అసలు పేరు సాధన శివదాసాని. సాధన సింధీ హిందూ కుటుంబంలో కరాచీలో జన్మించారు .దేశ విభజన తరువాత కుటుంబం ముంబైలో స్థిరపడ్డారు .ఆమె విద్యాభ్యాసం ముంబై లోనే జరిగింది. సాధన చిత్ర రంగ ప్రవేశానికి కారణభూతురాలు నటి నూతన్ .1955 లో రాజకపూర్ చిత్రం శ్రీ 420 ఒక కోరస్ సాంగ్ లో (ముర్ ముర్ కె న దేఖ్ ముర్ ముర్ కె ) నటించారు .వర్ధమాన నటుడు జాయ్ ముఖేర్జీ తో కలిసి యాక్టింగ్ స్కూల్ లో ట్రైనింగ్ తీసుకున్నారు . 1960 లో జాయ్ తో కలిసి లవ్ ఇన్ సిమ్లా లో నటించారు. అందులో ఆమె హెయిర్ కట్ అందరిని ఆకర్షించింది .తరువాత జాయ్ తో కలిసి ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా లో నటించి తారాపథంలోకి దూసుకెళ్లారు .వరుసగా 1961 లో హమ్ దోనో 1962 లో అస్లీ నక్లి  1963 లో మేరె మెహబూబ్ 1964 లో ఓహ్ కౌన్ థి 1965 లో ఆర్జూ 1966 లో మేరా సాయా చిత్రాలలో నటించి అధిక పారితోషికం తీసుకునే నటీమణుల కోవలో చేరారు .  సాధన 1966 మార్చ్ 7 న దర్శకులు ఆర్ కే నయ్యర్ ను వివాహం చేసుకున్నారు .కానీ వీరికి సంతానం కలుగలేదు .1995 లో ఆస్తమా వ్యాధితో ఆర్ కే నయ్యర్ మరణించారు. తరువాత సాధన 2015 లో తీవ్ర అనారోగ్యం పాలై డిసెంబర్ 25 న ముంబై లోని హిందుజా హాస్పిటల్ లో మరణించారు .

Post a Comment

0Comments

Post a Comment (0)