బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్)ను అంటువ్యాధుల చట్టం క్రింద పరిగణించాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ రాష్ట్రాలకు లేఖను పంపారు. ఇకపై రాష్ట్రాలు కేంద్ర హోమ్ శాఖకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే రాజస్థాన్, తెలంగాణలు అంటువ్యాదిగా ప్రకటించాయి. మహారాష్ట్ర లో 1500 మందిని గుర్తించారు. వీరిలో 90 మంది మరణించారు. రాజస్థాన్లో 100, తమిళనాడులో 9 కేసులు గుర్తించారు.
