విజయనగర చారిత్రక వైభవాన్ని చాటి చెప్పేలా విజయనగరం ఉత్సవ్ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయనగర చారిత్రక వైభవాన్ని చాటి చెప్పేలా విజయనగరం ఉత్సవ్ నిర్వహించింది. విజయనగరంలో నిర్వహించిన విజయనగరం ఉత్సవ్ లో ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. నిన్న రాత్రి విజయనగరం పైడితల్లి ఆలయం వద్ద మంత్రులు వంగలపూడి అనిత కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజయనగరం ఉత్సవ్ లో భాగంగా ఏర్పాటు చేసిన లేజర్ షోను తిలకించారు. ఆపై మాట్లాడిన ఆయన విజయనగరం ఔన్నత్యాన్ని, గత చారిత్రక వైభవాన్ని విజయనగరం ఉత్సవ్ చాటుతుంది అన్నారు. ఆధ్యాత్మిక చింతనకు, కళలకు, సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం విజయనగరం అని ఆయన ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా విజయనగరం ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం పైడిమాంబ తల్లి దేవాలయం, సిరిమాను ఉత్సవాలు, రామతీర్థం, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన బొబ్బిలి వీణ వంటి ఎన్నో ప్రత్యేకతలతో విలసిల్లిన నగరం విజయనగరం అన్నారు. మహాకవి గురజాడ అప్పారావు, వయోలిన్ విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు, మల్లయుద్ధ ప్రవీణుడు కోడి రామమూర్తి తదితరులను ఆయన గుర్తు చేశారు. అద్భుత గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పాటల ఓనమాలు నేర్చుకున్న ప్రాంతం ఇది అన్నారు. మధురగాయని సుశీలమ్మ గొంతెత్తి పాడిన ప్రాంతం కూడా ఇదేనని గుర్తు చేశారు. ఈ ఉత్సవ్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అదితి గజపతిరాజు తదితరులకు ఆయన అభినందనలు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)