ధరణి దారుణాల నుంచి రైతులకు విముక్తి కల్పిస్తూ భూ భారతి తెచ్చాం !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో శిక్షణ పొందిన సర్వేయర్లకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లైసెన్సులు అందజేశారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల ధరణి దారుణాల నుంచి రైతులకు విముక్తి కల్పిస్తూ భూ భారతి తెచ్చామని అన్నారు. ఇకపై సమగ్ర భూ సర్వేల ఆధారంగా రైతులకు తమ భూములపై పక్కా హక్కులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. గ్రామ గ్రామాన రైతుల సేవకు లైసెన్సుడ్ సర్వేయర్లు కంకణం కట్టుకోవాలని కోరారు. అంతకుముందు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ధరణి పేరిట చేసిన తప్పులను తమ ప్రభుత్వం సరిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టిందని ఇందులో భాగంగా 3456 మందికి లైసెన్స్‌లు మంజూరు చేశామని తెలిపారు. చిన్న అవకతవకలు కూడా జరగకుండా, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయకుండా ప్రజా, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా చిత్తశుద్దితో పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సర్వేయర్లను కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)