ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లను భారీగా పెంచిన కేంద్రం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లను కేంద్రం భారీగా పెంచింది. గైనిక్, జనరల్ మెడిసిన్, ఇతర స్పెషాలిటీ కోర్సుల్లో ప్రస్తుతం ఉన్న వాటి కంటే అదనంగా 106 సీట్ల మంజూరు చేసింది. వాటిని భర్తీ చేయడానికి అవసరమైన ప్రతిపాదనలను నేషనల్ మెడికల్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. జగన్ హయాంలో నిర్మాణాన్ని పూర్తి చేసుకుని, ప్రస్తుతం తరగతులు కొనసాగుతున్న అయిదు వైద్య కళాశాలల్లో కొత్తగా వచ్చిన సీట్లు 60 వరకు ఉన్నాయి. ప్రస్తుతం పీజీ వైద్య విద్యలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,763 బ్రాడ్ స్పెషాలిటీ, 4 డిప్లొమా కోర్సు సీట్లు ఉండగా, వాటి సంఖ్య ఇప్పుడు పెరిగినట్టయింది. 11 కళాశాలలకు కలిపి 106 సీట్లు కొత్తగా మంజూరు అయ్యాయి. జనరల్ మెడిసిన్- 20, గైనకాలజీ- 20, పీడియాట్రిక్-26, ఎనస్థీషియా-12, రేడియాలజీ- 4, ఇతర విభాగాల్లో మరికొన్ని సీట్లను మెడికల్ కమిషన్ కేటాయించింది. వీటితో పాటు అయిదు వైద్య కళాశాలల్లో పీజీ సీట్లను పెంచడానికి సంబంధించిన ప్రతిపాదనలనూ ఎన్ఎంసీ ఆమోదించింది. ఫలితంగా మచిలీపట్నం మెడికల్ కాలేజీ- 12, నంద్యాల- 16, రాజమహేంద్రవరం- 16, విజయనగరం- 12, ఏలూరు- 4 సీట్లు పెరిగాయి. గుంటూరు మెడికల్ కళాశాలకు రేడియోలజీ విభాగం- 4, ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్‌- 4, పీడియాట్రిక్- 4, అనంతపురం- 15, కడప- 7, కర్నూలు -4, శ్రీకాకుళం- 8 సీట్లు అదనంగా లభించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)